VijayRashmika: 'విరోష్' రిసెప్షన్‌కు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ.. రూల్స్ అతిక్రమిస్తే నో ఛాన్స్!

VijayRashmika: 'విరోష్' రిసెప్షన్‌కు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ.. రూల్స్ అతిక్రమిస్తే నో ఛాన్స్!

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి రిసెప్షన్ రేపు ( మార్చి 4న )  హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇందు కోసం తాజ్ కృష్ణా హోటల్ లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ!

అయితే విజయ్, రష్మికలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో 'టీమ్ విరోష్' కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం 'వన్ టైమ్ క్యూఆర్ కోడ్' (One-time QR Code) పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆహ్వాన పత్రికతో పాటు పంపిన క్యూఆర్ కోడ్ ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. ఒక్కసారి కోడ్ స్కాన్ చేసి లోపలికి వెళ్తే, మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వెళ్లడం సాధ్యం కాదు. వేదిక పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటాయి. ఆహ్వానం లేని వారు ఎవరూ హోటల్ ప్రాంగణానికి రావద్దని నిర్వాహకులు గట్టిగా విజ్ఞప్తి చేశారు.

అభిమానులకు విన్నపం

విజయ్ దేవరకొండ టీమ్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. మీ ప్రేమకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. కానీ భద్రతా కారణాల దృష్ట్యా, ఆహ్వానం, క్యూఆర్ కోడ్ లేని వారు తాజ్ కృష్ణ వద్దకు రావద్దని కోరుతున్నాము. ఇది పోలీసుల పర్యవేక్షణలో జరిగే ప్రైవేట్ వేడుక. దయచేసి మాకు సహకరించండి అని విజ్ఞప్తి చేశారు.

►ALSO READ | Nayanthara: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నయనతార.. యష్ 'టాక్సిక్' కోసం ఎన్ని కోట్లు తీసుకుంటుందంటే?

కలర్ ఫుల్ గా ఏర్పాట్లు

రిసెప్షన్ కోసం తాజ్ కృష్ణ హోటల్‌ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఇండో-వెస్ట్రన్ థీమ్‌తో డెకరేషన్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్, రష్మిక ఈ వేడుకలో డిజైనర్ వేర్ లో మెరిసిపోనున్నారు. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ విజయ్-రష్మిక ఒక్కటవ్వడం సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వేడుకగా మారింది. ఇప్పటికే వీరి పెళ్లి, సంగీత్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.