లక్ష్యసేన్ సంచలనం.. వరల్డ్ నంబర్‌‌‌‌ వన్ షి యుకీపై విక్టరీ

లక్ష్యసేన్ సంచలనం.. వరల్డ్ నంబర్‌‌‌‌ వన్ షి యుకీపై విక్టరీ

బ‌‌ర్మింగ్‌‌హామ్: ఇండియా స్టార్ లక్ష్య సేన్  ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌‌షిప్‌‌ను సంచలన విజయంతో ఆరంభించాడు. తొలి రౌండ్‌‌లోనే డిఫెండింగ్ చాంపియన్‌‌, వరల్డ్ నంబర్ వన్ షి యుకీని ఓడించి ఔరా అనిపించాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్ పోరులో 12వ ర్యాంకర్ లక్ష్యసేన్ 23–-21, 19–-21, 21–-17 తేడాతో చైనా స్టార్ షట్లర్ యుకీని ఓడించాడు.  తొలి గేమ్‌‌లో లక్ష్య సేన్ 11–-7తో ఆధిక్యంలోకి వెళ్లినా చైనా ప్లేయర్ పుంజుకోవడంతో స్కోరు 20–-20 వద్ద సమమైంది. 

సంయమనం కోల్పోకుండా ఆడిన లక్ష్య ఐదో గేమ్ పాయింట్‌‌ నెగ్గి గేమ్‌‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌‌లో యుకీ  గెలిచినా.. నిర్ణాయాక మూడో గేమ్‌‌లో లక్ష్య సేన్ తన ఫిజికల్ ఫిట్‌‌నెస్‌‌తో పాటు పర్ఫెక్ట్ షాట్లతో సత్తా చాటాడు. మిక్స్‌‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌‌లో ధ్రువ్ కపిల–- తనీషా క్రాస్టో 21-–17, 21-–19తో హూ పంగ్–చెంగ్ సు యిన్ (మలేసియా)పై గెలిచి రెండో రౌండ్ చేరింది. కానీ, విమెన్స్ సింగిల్స్‌‌లో మాళవిక బన్సోద్ 11-–21, 6–-21తో చెన్ యుఫీ (చైనా) చేతిలో ఓడింది