కరోనా ఉధృతి మరింత తీవ్రమవ్వొచ్చు: ట్రంప్

కరోనా ఉధృతి మరింత తీవ్రమవ్వొచ్చు: ట్రంప్

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. రోజురోజుకీ వైరస్ కేసులు పెరుగుతున్నాయనే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. బుధవారానికి వరల్డ్‌ వైడ్ కరోనా కేసుల సంఖ్య 15 మిలియన్‌లు దాటింది. కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. కరోనా ప్రభావం తగ్గే ముందు వైరస్ మరోమారు భీకరంగా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నవంబర్‌‌లో యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. కరోనా విషయంలో వూహాన్ వైరస్ అంటూ చైనాను విమర్శిస్తూ వచ్చిన ట్రంప్.. చాలా రోజుల పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ కట్టుకోకుండా కనిపించారు. అయితే తన ప్రత్యర్థి డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఎన్నికల క్యాంపెనియింగ్‌లో దూసుకెళ్లున్నారు. దీంతో రూటు మార్చిన ట్రంప్ ఈమధ్యే మాస్కు వాడకాన్ని మొదలుపెట్టారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో బిడెన్, ట్రంప్ పోటాపోటీగా దూకుడు పెంచుతూ ముందుకెళ్తున్నారు.