తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు 400పై చిలుకు హామీలిచ్చి.. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మే 15వ తేదీ  బుధవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక వనరుల సమీకరణ ఏవిధంగా చేయబోతున్నారో రేవంత్ చెప్పాలన్నారు. 

 కాంగ్రెస్..  ఇచ్చిన ఏ హామీ కాంగ్రెస్‌ అమలు చేయట్లేదన్నారు కిషన్ రెడ్డి.  మహాలక్ష్మి పథకం కింద ఒక ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే రాష్ట్రంలో అమలవుతుందని చెప్పారు. హామీలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు. హామీల అమలుపై ప్రజల తురుపున పోరాటం చేస్తామన్నారు.

బీజేపీపై రేవంత్ రెడ్డి బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.  ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని రేవంత్ వ్యక్తిగతంగా విమర్శించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని చెప్పారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని  కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.