GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్

GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్

ఐపీఎల్ 2024లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. అగ్రపీఠం కోసం చూసేది ఒకరైతే.. పరువు కోసం చూస్తున్నవారు మరొకరు. రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్.. అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు పంజాబ్.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. లీగ్ దశలో వీరికి ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. రెండింట విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు.

తుది జట్లు

పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్(కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

రాజస్థాన్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.