IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!

IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!

దక్షిణాఫ్రికా పేసర్, పంజాబ్ కింగ్స్ ప్రధాన బౌలర్ కగిసో రబడా స్వదేశానికి వెళ్ళిపోయాడు. అతను రాకను క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) ధ్రువీకరించింది. మృదు కణజాల ఇన్ఫెక్షన్ కారణంగా రబడా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు  దక్షిణాఫ్రికా బోర్డు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

రబడ ప్రస్తుతం క్రికెట్ దక్షిణాఫ్రికా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండడంతో వైద్య బృందం అతన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అయితే, ఈ ఇన్ఫెక్షన్ తమ పేసర్ టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై ఎలాంటి ప్రభావం చూపదని CSA అంచనా వేస్తోంది. మెగా టోర్నీ ప్రారంభంనాటికి అతను ఫిట్‌గా ఉంటాడని భావిస్తోంది.

28 ఏళ్ల రబడ ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 11 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టినప్పటికీ.. వీటిలో టెయినలెండర్లవే ఎక్కువ. అందునా, అతను ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే-ఆఫ్స్ రేసు నుండి వైదొలిగింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు పంజాబ్.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. లీగ్ దశలో వీరికి ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. మే 16న రాజస్థాన్ రాయల్స్ తో, మే 19న సన్‌రైజర్స్ హైదరాబాద్ తో వీరు తలపడనున్నారు.