
2029 వరకు ప్రధానిగా మోదీ ఉంటారని చెప్పారు కేంద్రమంత్రి అమిత్ షా. 2029 తర్వాత కూడా తమ నాయకుడు మోదీనే అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ప్రచారం చేశారు అమిత్ షా. బెంగాల్‌లో తాము 24 నుంచి 30 స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో దౌర్జన్యాలపై హైకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు అమిత్ షా. పాక్ వద్ద అణుబాంబు ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రాహుల్ జవాబివ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 18 స్థానాలను కైవసం చేసుకుంది. మా, మాతి, మానుష్ నినాదంతో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇప్పుడు ఆ నినాదం లేదన్నారు. దుర్గామాత నిమజ్జనికి అనుమతి ఇవ్వని మమతా సర్కార్.. రంజాన్ కు మాత్రం ముస్లిం ఉద్యోగులకు సెలవులు ఇస్తుందని విమర్శించారు అమిత్ షా.