Pooja Hegde: బుట్టబొమ్మకే షాకిచ్చిన చిచ్చరపిడుగు.. 'మౌనికా' సాంగ్‌కు బుడ్డోడి మాస్ స్టెప్పులు వైరల్!

Pooja Hegde: బుట్టబొమ్మకే షాకిచ్చిన చిచ్చరపిడుగు.. 'మౌనికా' సాంగ్‌కు బుడ్డోడి మాస్ స్టెప్పులు వైరల్!

సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్నావారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో సామాన్యులు చేసే సందడి ఒక్కోసారి సెలబ్రిటీలనే మైమరిపిస్తుంటుంది. లేటెస్ట్ గా అచ్చం అలాంటి ఘటనే నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన  ' కూలీ ' మూవీలోని 'మౌనిక' సాంగ్ ఎంతటి క్రేజ్ ను సంపాదించిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు వేసిన స్టెప్పులు చూసి స్వయంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఆశ్చర్యపోయింది.

అసలేం జరిగిందంటే?

తమిళనాడులో లేటెస్ట్ గా జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో అభిమానులు ఆమెను 'మౌనికా' సాంగ్‌కు డ్యాన్స్ చేయమని కోరారు. రజినీకాంత్ సినిమాలో తను చేసిన ఈ స్పెషల్ సాంగ్ అప్పట్లో యూట్యూబ్‌ను ఊపేసింది. అభిమానుల కోరిక మేరకు పూజా స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం ప్రారంభించగా.. పక్కనే ఉన్న ఐదేళ్ల బాలుడు ఊహించని రేంజ్‌లో ఎనర్జీని చూపించాడు. పూజా హెగ్డే , సౌబిన్ షాహిర్ కలిసి చేసిన ఒరిజినల్ స్టెప్పులను ఆ బుడ్డోడు తనదైన శైలిలో అదరగొట్టేశాడు. పూజా సైతం ఆ బుడ్డోడి జోరు చూసి కాసేపు స్టెప్పులు ఆపేసి మురిసిపోయింది. అక్కడున్న వారంతా ఆ బాబు ఎనర్జీకి ఫిదా అయిపోయి ఈలలతో గోల చేశారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్‌లను మించిపోయేలా ఉన్నాడు ఈ చిచ్చరపిడుగు అని కొందరు. అనిరుధ్ మ్యూజిక్ కి ఆ ఎనర్జీ కరెక్ట్ గా సెట్ అయ్యింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గతేడాది ఆగస్టు 14న విడుదలైన 'కూలీ' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి దిగ్గజ నటులు నటించారు.. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, ముఖ్యంగా పూజా హెగ్డే మెరిసిన 'మౌనికా' సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్లస్ పాయింట్. మొత్తానికి 'కూలీ' వచ్చి వెళ్లినా, ఆ సినిమాలోని పాటలు మాత్రం ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి.