మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ

మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ

ఓ దళిత వ్యక్తిపై ఇద్దరు హోంగార్డ్స్ డాడి చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైరయ్యారు. ఉత్తరప్రదేశ్ లో సామాన్య ప్రజలపై ప్రభుత్వ దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.  

రాయ్ బరేలీలో రేషన్ షాపుకు వచ్చిన వీరేంద్రకుమార్ అనే దళితుడిపై ఇద్దరు హోంగార్డులు విచక్షణా రహితంగా కొట్టారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకుని.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతావా.. అంటూ దాడి చేశారు. పోలీసులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఘటనపై స్పందించిన ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సోదరులపై విచక్షణా రహితంగా దాడి చేసే ధైర్యం.. పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.  రేషన్ కోసం వచ్చిన వ్యక్తిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. ప్రతీ భారతీయుడికి ఆహారపు హక్కు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు.