విజృంభిస్తున్న మహమ్మారి.. దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

విజృంభిస్తున్న మహమ్మారి.. దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకీ హెచ్చుతోంది. దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. బుధవారం కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వైరస్ పాజిటివ్‌లు పెరగడం భయాందోళనలు కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళతోపాటు మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 17 వేల కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఇండియాలో కరోనా కన్ఫర్మ్‌ కేసుల సంఖ్య 11,92,915గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసులు 4.11 లక్షలుగా ఉండగా.. 7.53 లక్షల మంది రికవర్ అయ్యారు. వైరస్ బారిన పడి 28,732 మంది చనిపోయారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించనున్నారు. ఇప్పటికే వారంలో రెండ్రోజులు లాక్‌డౌన్ వేయాలని బెంగాల్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బుధవారానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 మిలియన్‌లు దాటింది.