- ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్పై పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు లైన్ క్లియర్ అయ్యింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీర్, ఆర్డీ శాఖ కమిషనర్ డి.దివ్య దేవరాజన్బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధిలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కోరుకున్న గ్రేడ్–-1, 3, 4 కార్యదర్శులకు ఈ నెల 22న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
బదిలీ కోరుకునే అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను తెలియజేస్తూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఆదేశించారు. అలాగే, వెబ్ అప్లికేషన్ ప్రింట్ అవుట్‌తోపాటు ధ్రువీకరించిన ఫిజికల్ అప్లికేషన్లను డీపీవోల ద్వారా గురువారం మధ్యాహ్నంలోగా కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
