V6 News

పైసలగిడితే 9490616555 నెంబరుకు కంప్లైంట్ చేయండి : సీవీ ఆనంద్

పైసలగిడితే 9490616555 నెంబరుకు కంప్లైంట్ చేయండి : సీవీ ఆనంద్

ఇళ్లు కట్టుకునేవారు ఎవరికీ పైసలివ్వాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకునే వారు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. డబ్బివ్వాలని ఎవరైనా వేధిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని సూచించారు. ఇందుకోసం సిటీ పోలీసులు ప్రత్యేకంగా 9490616555 వాట్సప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్ కు వెళ్లలేకపోతే డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

కొత్తగా ఇండ్లు కట్టుకునే వారిని అనుమతులు లేవంటూ కొందరు వేధిస్తుండటం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో నిర్మాణాన్ని అడ్డుకుంటామని బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోవడంతో పోలీసులు వాటిపై దృష్టి సారించారు. ఇండ్లు కట్టుకునే వారికి అండగా నిలిచేందుకు వాట్సప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు.