బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వేసిన వ్యాఖ్యలు స్పీకర్ గడ్డం ప్రసాద్ పైనే కాదని.. మొత్తం దళిత సమాజాన్ని అవమానించారని అన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 2026 సెప్టెంబర్ 07న స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్పీకర్ దళితుడనే ఈ విధంగా మాట్లాడారని.. ఆ ఎమ్మెల్సీని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి.. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు భృతి.. మొదలైనవి 2018 మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారని.. పదేండ్లు అధికారంలో ఉండి హామీలు అమలు చేయలేకపోయారని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండు సంత్సవరాలలోనే హామీలు అమలు చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వంలో భాగంగా హామీలు దాదాపు అమలు చేశామని.. మిగతా హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అధికారం కోల్పోయినందుకు ఫ్రస్ట్రేషన్ లో బురద జల్లేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారని విమర్శించారు.
ALSO READ ; రాజకీయ డ్రామాలు ఆపి.. అసెంబ్లీకి రండి:
ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే.. అది ప్రజాస్వామికంగా ఉండాలని సూచించారు. కానీ స్పీకర్ పై వాడు, వీడు అంటూ బూతులు తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. బూతులు తిట్టిన ఎమ్మెల్సీని డిస్మిస్ చేయాలని కోరారు.
