హెచ్ సీఏలో అవినీతి:వ్యక్తిగతంగా తీసుకోవద్దు

హెచ్ సీఏలో అవినీతి:వ్యక్తిగతంగా తీసుకోవద్దు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌క్రికెట్‌‌సంఘం (హెచ్‌‌సీఏ)లో అవినీతి రాజ్యం ఏలుతోందని తాను చేసిన ఆరోపణను వ్యక్తిగతంగా తీసుకోవద్దని హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ అజరుద్దీన్‌‌కు అంబటి రాయుడు సూచించాడు. హెచ్‌‌సీఏలో అవినీతి నిర్మూలించి, భావి క్రికెటర్లను కాపాడాలన్నాడు. హెచ్‌‌సీఏలో భారీ అవినీతి జరుగుతోందని, టీమ్‌‌సెలెక్షన్స్‌‌ను డబ్బు, పొలిటికల్‌‌పవర్‌‌ప్రభావితం చేస్తోందని ఆరోపించిన రాయుడు.. ఈ విషయంలో కల్పించుకోవాలని మంత్రి కేటీఆర్‌‌ను విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.  అయితే
‘అంబటి ఓ ఫ్రస్ట్రేటెడ్‌‌క్రికెటర్‌‌’ అంటూ  అజర్‌‌ఈ విషయాన్ని లైట్‌‌తీసుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని రాయుడు తిప్పికొట్టాడు. ‘హాయ్‌‌అజర్‌‌. దీన్ని వ్యక్తిగతంగా మార్చొద్దు.  సమస్య మన ఇద్దరికన్నా చాలా పెద్దది. హెచ్‌‌సీఏలో అసలు ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్‌‌క్రికెట్‌‌ను ప్రక్షాళన చేసే అద్భుత అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. కానీ, చుట్టూ ఉన్న దగాకోరుల నుంచి దూరంగా ఉండాలని కోరుతున్నా. అప్పుడే రాబోయే తరాల క్రికెటర్ల ఫ్యూచర్‌‌ను కాపాడగలరు’ అని ట్వీట్‌‌చేసిన రాయుడు.. ‘క్లీనప్‌‌హైదరాబాద్‌‌క్రికెట్‌‌’ అనే హాష్‌‌ట్యాగ్‌‌ను జతచేశాడు. మరోవైపు అంబటి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది.  ఈ విషయాన్ని  ధైర్యంగా ప్రశ్నించిన స్టార్‌‌క్రికెటర్​ను పలువురు అభినందిస్తున్నాడు. ‘క్లీనప్‌‌హైదరాబాద్‌‌క్రికెట్‌‌’ హాష్‌‌ట్యాగ్‌‌తో రాయుడుకు మద్దతు తెలుపుతున్నారు. హెచ్‌‌సీఏ అవినీతిపై చాలాకాలం తర్వాత మరో హైదరాబాదీ క్రికెటర్‌‌బయటికి మాట్లాడాడని మాజీ క్రికెటర్‌‌సాద్‌‌బిన్‌‌జంగ్‌‌అన్నాడు. అతనెప్పుడూ సత్యం వైపు నిలబడుతాడని అభిప్రాయపడ్డాడు. తన క్లోజ్‌‌ఫ్రెండ్‌‌, ఒకప్పుడు తన టీమ్‌‌వైస్‌‌కెప్టెన్‌‌అయిన అజరుద్దీన్‌‌ఈ విషయంపై సానుకూలాంగా స్పందిస్తాడని ఆశిస్తున్నానని ట్వీట్‌‌చేశాడు.
హెచ్‌‌సీఏలో అవినీతిపరులకు రెడ్‌‌కార్పెట్‌‌పరుస్తున్నారన్న అంబటి వ్యాఖ్యలు నిజమని శాట్స్‌‌చైర్మన్‌‌అల్లీపురం వెంకటేశ్వర్‌‌రెడ్డి అన్నారు. ఎంతో టాలెంట్‌‌ఉన్న రాయుడికి హెచ్‌‌సీఏ పెద్దలు అడుగడుగునా అడ్డు పడుతున్నారని  విమర్శించారు.