ఖైరతాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ

ఖైరతాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీఎస్ మక్తా, వెంకటేశ్వర కాలనీ, గౌరీ శంకర్ నగర్, ఫిలిం నగర్ బస్తీల్లో దానం ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందని అన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సర్కారు వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తోందని దానం చెప్పారు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద లక్షా116 రూపాయల ఆర్థికసాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని దానం నాగేందర్ ప్రశంసించారు.