V6 News

నల్ల జాతీయుడిగా గర్విస్తున్నా: డారెన్ సామీ

నల్ల జాతీయుడిగా గర్విస్తున్నా: డారెన్ సామీ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు ప్రేక్షకులు తనను ‘కాలూ’ అని పిలిచారని ఇటీవల విండీస్ ఆల్‌రౌండర్ డారెన్ సామీ చెప్పిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌‌హెచ్‌ టీమ్‌మేట్స్‌లో కూడా ఎవరైతే తనను అలా పిలిచారో వారికీ విషయం తెలుసునని, దీని గురించి వారు తనతో మాట్లాడాలని.. చాలా నిరాశ చెందానని సామీ పేర్కొన్నాడు. తాజాగా మరోసారి సామీ ఈ విషయంపై మాట్లాడాడు.

‘సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌మేట్స్‌లో ఒకరు నాతో మాట్లాడారు. ప్రతికూలతలపై దృష్టి పెట్టకుండా విషయాలను అర్థం చేసుకోవాలి. ప్రేమను పంచే ప్లేస్ నుంచి పని చేస్తున్నామని నా బ్రదర్ నాకు భరోసా ఇచ్చాడు. నేను అతణ్ని నమ్ముతున్నాన’ని సామీ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశాడు. నల్ల జాతీయుడిగా నమ్మకంగా, గర్వంగా ఉన్నానని.. అదెప్పటికీ మారదన్నాడు. గతంలో ఇషాంత్ శర్మ చేసిన ఓ పోస్ట్‌ను బట్టి అతడే సామీని కాలూగా పిలిచాడని తెలుస్తోంది. ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌లో సామీని ఇషాంత్‌ కాలూగా అభివర్ణించాడని సమాచారం.