తెలంగాణ రైతులకు ఆసరాగా దక్కన్​ ముద్రా

తెలంగాణ రైతులకు ఆసరాగా దక్కన్​ ముద్రా
  • తెలంగాణ సోనా రైస్​ సీడ్స్​ సప్లయ్​, బైబ్యాక్​

హైదరాబాద్​, వెలుగు: అన్నదాతకు ఎక్కువ అవసరమైన రెండు సేవలను దక్కన్​ ముద్రా అందిస్తోంది. తెలంగాణ సోనా విత్తనాలు రైతులకు ఇవ్వడంతోపాటు వారి పంటను కూడా కొనుగోలు చేస్తోంది ఈ కంపెనీ. గత మూడు సీజన్లుగా ఇబ్రహీంపుర్​, దుబ్బాక, జనగాం ప్రాంతాలలోని రైతుల నుంచి తెలంగాణ సోనా ధాన్యాన్ని సేకరించి, హైదరాబాద్​, విశాఖపట్నం, బెంగళూరులలోని 150 అవుట్​లెట్ల ద్వారా ఈ తెలంగాణ సోనా రైస్​ను దక్కన్​ ముద్రా విక్రయిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్​ శ్రీహర్ష చెప్పారు. ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్​ యూనివర్శిటీ డెవలప్​ ఈ లో గ్లైకిమిక్​ ఇండెక్స్​ వేరియంట్​ తెలంగాణ సోనాను డెవలప్​ చేసింది. డయాబెటిస్​ ఉన్న వారు కూడా ఈ రైస్​ను తీసుకోవచ్చు. 120 మందికిపైగా రైతులు తమతో కలిసి పనిచేస్తున్నారని, ఈ సంఖ్యను మరింతగా పెంచాలని టార్గెట్​గా పెట్టుకున్నామని శ్రీహర్ష తెలిపారు. బ్లాక్​రైస్​, సన్​ఫ్లవర్​సీడ్స్​లలోకి అడుగు పెట్టాలనుకుంటున్నామని, వుడ్​ప్రెస్డ్​ సన్​ఫ్లవర్​ ఆయిల్​ను మార్కెట్లోకి తేవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మా గురించి కేటీఆర్​ ట్వీట్​ చేయడం సంతోషం కలిగిస్తోందని, ఈ ఉత్సాహంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాల రైతులకూ సేవలు విస్తరిస్తామన్నారు.