హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఈడీ , డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన డీఈఈ సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 76.87% మంది అటెండ్ అయినట్టు డీఈఈసెట్ కన్వీనర్ గాజర్ల రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 60 కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 32,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 25,054 మంది హాజరయ్యారు.
తెలుగు మీడియం అభ్యర్థులు 12,373 మందికి గాను 9,612 మంది (77.69 శాతం) హాజరయ్యారు. ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో 20,219 మంది అభ్యర్థులకు గాను 15,442 మంది అటెండయ్యారు. కాగా, ఈ నెల 25న ప్రిలిమినరీ కీని deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో పెడ్తామని కన్వీనర్ చెప్పారు.
