వచ్చేవారం ఉచిత తీర్థయాత్ర పునఃప్రారంభం

వచ్చేవారం ఉచిత తీర్థయాత్ర పునఃప్రారంభం

వృద్ధుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఉచిత తీర్థ యాత్ర పథకాన్ని తిరిగి ప్రారంభించింది.  వచ్చేవారం నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనలో భాగంగా ఈనెల 14 నుంచి గుజరాత్ లోని ద్వారకకు సీనియర్ సిటిజన్స్ తో కూడిన రైలు బయల్దేరనుంది. మరో రైలు ఫిబ్రవరి 18న తమిళనాడులోని రామేశ్వరానిరికి వెళ్లనుంది. ఈ పథకంలో భాగంగా యాత్రికులు వైష్ణోదేవి, షిర్డీ, రామేశ్వరం, ద్వారకాపురి, హరిద్వార్, రిషికేశ్, మధుర, బృందావన్ లను సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అయోధ్యను కూడా ఈ జాబితాలో చేర్చింది. 2019లో కేజ్రీవాల్ సర్కార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు..అలాగే వారి వెంట వచ్చే సహాయకులకు ప్రతి ఏడాది ఉచిత తీర్థయాత్రను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సినియర్ సిటిజన్ల కోసం ఉచితంగా తీర్థయాత్రలను నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని వార్తల కోసం

అమాయక విద్యార్థుల్లో విభజన ఏర్పడే ప్రమాదం

కేర‌ళ ట్రెక్క‌ర్‌ను ర‌క్షించిన ఆర్మీ