చిదంబరంకు ముందస్తు బెయిల్ రద్దు

చిదంబరంకు ముందస్తు బెయిల్ రద్దు

INX మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. చిదంబరం కు ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ముందస్తు బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేసిన చిదంబరానికి పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చాలెంజ్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపణ. తన కుమారుడు కార్తీ కోసమే ఐఎన్ఎక్స్ మీడియాలోకి  చిదంబరం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారని ఈడీ వాదన.