Kajal Agarwsal: నటన చూసి కాదు.. నా ఏడుపు చూసి.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kajal Agarwsal: నటన చూసి కాదు.. నా ఏడుపు చూసి.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మికళ్యాణం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఏ బ్యూటీ.. ఆతరువాత వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ గా మారింది. పెళ్లి తరువాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ కి మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవల బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాం కి హాజరయ్యారు కాజల్. ఇందులో భాగంగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ తనకు హీరోయిన్ గా అవకాశం ఎలా వచ్చింది అనేదానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకసారి ఫోటో చూసి డైరెక్టర్ తేజ నన్ను ఆడిషన్ కు రమ్మన్నారు. అడిషన్స్ లో ఏం అడుగుతారా అని చూస్తున్న నన్ను పిలిచి.. ఏడవమని చెప్పారని తెలిపింది. నాకు అర్థ కాలేదు.. అసలు కారణం లేకుండా ఎలా ఏడుస్తారు అనుకున్నాను. ఎం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే మా నాన్న ఓ విషయం చెప్పింది. అది విన్నాక నాకు నిజంగానే ఏడుపు వచ్చింది. బాగా ఏడ్చాను... ఆలా ఏడ్చినందుకు లక్ష్మీ కళ్యాణం సినిమాలో అవకాశం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.