Gangs of Godavari: లంకల రత్న చీకటి ప్రపంచాన్ని వివరిస్తూ..త్రివిక్రమ్ సాకీ లిరిక్స్..సూపర్బ్

Gangs of Godavari: లంకల రత్న చీకటి ప్రపంచాన్ని వివరిస్తూ..త్రివిక్రమ్ సాకీ లిరిక్స్..సూపర్బ్

రైటర్..డైరెక్టర్..హీరో..విశ్వక్ సేన్ (Vishwaksen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పాటను స్టార్  మ్యూజిక్  డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అద్భుతంగా కంపోజ్ చేయగా..కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు.డైరెక్టర్ త్రివిక్రమ్ తనదైన శైలిలో పదునైన సాకీ  లిరిక్స్ అందించి సాంగ్ను స్పెషల్ హైప్గా మలిచాడు.  

ఈ థీమ్ సాంగ్ విషయానికి వస్తే..అడవికి గొడ్డలి..కడుపుకి అంబలి..కత్తికి కోబలి..మట్టికి నాగలి బ్యాడ్ అంటూ సాగే ఈ గీతం హీరో విశ్వక్ సేన్ క్యారెక్టర్ ని వివరిస్తుంది.అలాగే,ఈ మూవీలోని కథానేపధ్యాన్ని వివరిస్తూనే..అందులోని చీకటి ప్రపంచాన్ని,పాత్రలను పరిచయం చేస్తూ సాగుతుంది..ప్రస్తుతం ఈ సాంగ్ కల్ట్ మాస్ ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ‘సుట్టంలా సూసి’ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ లో నేహా శెట్టి ,విశ్వక్ సేన్ క్యూట్ స్టెప్స్ తో అదరగొట్టారు.ఆ తరువాత రిలీజ్ చేసిన “మోత” గీతం మాస్ ప్రేక్షకులని ఊపేస్తోంది. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ విషయానికి వస్తే..సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో..ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి..వారికి దీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది.

ఇందులో హీరో విశ్వక్ సేన్ “లంకల రత్న” అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు ఇంతవరకూ బాడీ లాంగ్వేజ్ పరంగా..డైలాగ్ డెలివరీ పరంగా మాత్రమే మాస్గా కనిపించిన విశ్వక్ ఈ సినిమాలో మాస్ లుక్ తోనే కనిపిస్తున్నారు. ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.