ఆఫ్టర్ 9 పబ్బును సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

ఆఫ్టర్ 9 పబ్బును సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

లైసెన్స్ లేని పబ్బులు, బార్లపై రైడ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. గత పది రోజులుగా బార్లు రెస్టారెంట్లు, పబ్బులపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆఫ్టర్ 9 అనే పబ్బును సీజ్ చేశారు అమీర్ పేట్ ఎక్సైజ్ పోలీసులు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారని పబ్బు నిర్వహకులపై కంప్లైంట్ రాగా ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు. 

ఆఫ్టర్ 9 పబ్బుకు లైసెన్స్ లేదని గుర్తించారు. ఈ క్రమంలోనే పబ్బును సీజ్ చేశారు. బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేయగా  ఆఫ్టర్ 9 పబ్బు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారని తెలియడంతో సీజ్ చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.