SRH vs LSG: హైదరాబాద్- లక్నో మ్యాచ్‌పై ఫన్నీ మీమ్స్.. మీరూ చూసేయండి

SRH vs LSG: హైదరాబాద్- లక్నో మ్యాచ్‌పై ఫన్నీ మీమ్స్.. మీరూ చూసేయండి

బుధ‌వారం(మే 08) ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ బ్యాటర్ల విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది. రాహుల్ సేన ఎంతో శ్రమించి ఆరంజ్ ఆర్మీ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశిస్తే.. మన బ్యాటర్లు ఉఫ్‌మని ఊదేశారు. 9.4 ఓవర్లలోనే ఛేదించి.. లక్నో బౌలర్లకు అధిక విశ్రాంతినిచ్చారు. ఈ మ్యాచ్ విజయాన్ని పక్కనపెడితే.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు క్రికెట్ అభిమానులు బాధించాయి. 

ఈ మ్యాచ్‌లో లక్నో అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ఇదే ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకాకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మ్యాచ్ అనంతరం రాహుల్‌తో సమావేశమైన లక్నో ఓనర్.. తీవ్ర స్థాయిలో దుర్భాషలాడాడు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ వరకూ వెళ్లేదాక కూడా ఆగలేదు. బౌండరీ లైన్ వద్దే తిట్ల దండకం మొదలు పెట్టాడు. మరోవైపు,  హైద‌రాబాద్ ఓపెనర్ల బ్యాటింగ్ సరళిపై మీమర్స్ తమ క్రియేటివిటీతో నెట్టింట నానా రచ్చ చేశారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. వాటిని మీరూ తిలకించి కాసేపు కడుపుబ్బా నవ్వుకోండి..