ఢిల్లీలో ఆంక్షలు..16 మెట్రో స్టేషన్లు క్లోజ్

ఢిల్లీలో ఆంక్షలు..16 మెట్రో స్టేషన్లు క్లోజ్
  • పార్లమెంట్ పరిసరాలు, కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం 

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, ఐటీఓ సహా 16 కీలక మెట్రో స్టేషన్లను బుధవారం ఉదయం మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

‘‘భద్రతా కారణాల దృష్ట్యా లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారఖంబా రోడ్, సుప్రీం కోర్ట్, సేవా తీర్థ, జన్ పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేస్తున్నాం’’ అని డీఎంఆర్‌‌సీ పేర్కొంది.