నకిలీ జీలకర్ర తయారీ ఫ్యాక్టరీపై పోలీసుల దాడులు

నకిలీ జీలకర్ర తయారీ ఫ్యాక్టరీపై పోలీసుల దాడులు

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్న కొందరు కేటుగాళ్లు. ఇన్నాళ్లు బియ్యం, పప్పు ధాన్యాలు, కారం వంటి వాటిని కల్లీ చేస్తూ..సొమ్ముచేసుకున్న కల్తీ గాళ్లు..తాజాగా నకిలీ జీలకర్రను తయారు చేస్తూ పట్టుబడ్డారు.  ఢిల్లీలోని కంఝూవ్లాలోని మందన్ పూర్ లో గడ్డి బెల్లం, రాతిపొడితో నకిలీ జీలకర్రను తయారు చేస్తుండగా ..పోలీసులు పట్టుకున్నారు. 

ఫ్యాక్టరీలో నకిలీ జీలకర్ర తయారీ...
నకిలీ జీలకర్రను తయారు చేసేందుకు కొందరు వ్యక్తులు కంఝూవ్లాలోని మందన్ పూర్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. గడ్డి, బెల్లం, రాతిపొడిని ఉపయోగించి నకిలీ జీలకర్రను తయారు చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు..ఫ్యాక్టరీపై దాడి చేశారు. జీలకర్ర పొట్టు, మొలాసిస్, రాతి పొడితో జీలకర్రను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. 


 
భారీగా నకిలీ జీలకర్ర స్వాధీనం..
ఫ్యాక్టరీ నుంచి పోలీసులు భారీగా నకిలీ జీలకర్రను స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న 348 బస్తాల జీలకర్ర, గోడౌన్‌లో 55 బస్తాల జీలకర్ర, 35 గడ్డి బస్తాలు, 25 బెల్లం వెనిగర్, 25 బస్తాల కల్లుపొడి స్వాధీన పర్చుకున్నారు. మొత్తంగా 4198 కిలోల కంటే ఎక్కువ నకిలీ జీలకర్ర రికవరీ చేయబడినట్లు పోలీసులు తెలిపారు.