ఢిల్లీలో ఉద్యోగులకు వారం రోజులు వర్క్ ఫ్రం హోం

ఢిల్లీలో ఉద్యోగులకు వారం రోజులు వర్క్ ఫ్రం హోం

ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. పిల్లలు కలుషితమైన గాలి పీల్చకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారం రోజుల పాటు ప్రభుత్వ ఆఫీసులకు 100 శాతం వర్క్ ఫ్రం హోం ప్రకటించారు కేజ్రీవాల్. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని సూచించారు. ఢిల్లీలో నవంబర్ 17 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించారు. 

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాలుష్య నియంత్ర‌ణ‌కు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నివారణ కు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.