
బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రేమాయణాలు జరపడంలో ముందుంటారు.అలా అని తెలుగులో లేరని కాదు.చూసుకుంటే ఎవ్వరూ తక్కువేం కాదు.అసలు విషయానికి వస్తే..బాలీవుడ్ యంగ్ హీరో అదిత్యారాయ్ కపూర్ (Aditya Roy Kapur)-లైగర్ బ్యూటీ అనన్య పాండే (Ananyapandey) మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురుంచి బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వెడెక్కిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ జంట తమ ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారనే సమాచారం బయటికి వచ్చింది. రెండేళ్లుగా డేటింగ్‍లో ఉన్న వీరు బ్రేకప్ చెప్పేసుకున్నారని వారి క్లోజ్ ఫ్రెండ్ ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళితే..సుమారు నెల కిందటే వారిద్దరికీ బ్రేకప్ అయింది.
"అనన్య..ఆదిత్య మధ్య ఉన్న బంధం చాలా స్ట్రాంగ్గా ఉండేది.వారి బ్రేకప్ మాకు అందరికీ షాకింగ్‍గా ఉంది.ఇద్దరూ ఒకరితో ఒకరు బాగుంటారు.అనన్య ఈ విషయం నుంచి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బాధ మాత్రం ఉంటుంది. ఇప్పుడు జీవితంలో ముందుకెళ్లడానికి వీరు పయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె తన పెంపుడు జంతువులతో గడుపడానికి టైం కేటాయిస్తున్నట్లు..ఇక ఆదిత్య కూడా మెచ్యూరిటీతో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నటట్లు" వారి క్లోజ్ ఫ్రెండ్ చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.
గత నెలలో అనన్య పాండే తన ఇన్‍స్టాగ్రామ్‍లో పెట్టిన పోస్ట్ ఆదిత్య రాయ్ తో బ్రేకప్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.“ఒకవేళ అది మనకు చెందాల్సినదే అయితే..కచ్చితంగా మళ్లీ తిరిగి వస్తుంది.సొంతంగా నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్పేందుకే అది వదిలివెళుతుంది.ఒకవేళ అది మీకు దక్కాలని ఉంటే..దూరంగా తోసేసినా మళ్లీ వస్తుంది.తిరస్కరించినా మళ్లీ వస్తుంది” అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో తనదైన శైలిలో పోస్ట్ చేసింది.
ఈ జంట చివరిగా అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో కనిపించారు.ఇక అనన్య లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగు వైపు కన్నెత్తి చూడటం మరిచిపోయింది.