ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా

ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా

ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడిన అమిత్ షా..  ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. తన  వీడియో మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. 

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ధ్వజమెత్తారు.  రేవంత్ తెలంగాణను ఏటీఎంలా  మార్చారని ఆరోపించారు.  తెలంగాణలో పసుపు రైతుల కోసం  బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ఓటు  షేర్  పెరిగింది 10 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామనిచెప్పారు.  తెలంగాణ  ప్రజల గురించి మల్లికార్జున ఖర్గేకు ఏం తెల్వదన్నారు.