Most Expensive Players In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం కొంత మంది ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతూ రికార్డులు సృష్టిస్తున్నారు. కాగా ఈసారి 19వ సీజన్ లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరలకు కొనుగోలు చేసిన ప్లేయర్స్ ఎవరు అనే విషయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశం అయింది. టీ20 ప్రపంచకప్ 2026 ముగియడంతో.. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ లీగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ హిస్టరీని తెలుసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ లీగ్ గా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది జరిగే వేలంలో ప్లేయర్స్ పై ఫ్రాంచైజీలు భారీ మొత్తంగా ఖర్చు పెడుతుంటాయి. ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధరలకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
* రిషబ్ పంత్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడ్ని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ ని భారీ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా కొనసాగుతున్నాడు.
ALSO READ : భారత జట్టుని చూసి మా వాళ్లు గజగజ వణికిపోయారు బ్రో..
* శ్రేయస్ అయ్యర్:
శ్రేయస్ అయ్యర్ ని పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అతని నాయకత్వంతో 2025 ఎడిషన్ లో టీమ్ ఫైనల్ కి చేరడం విశేషం.
* కామెరాన్ గ్రీన్ :
కాగా 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రూ.25.20 కోట్లకు కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన తీవ్రమైన పోటీ తర్వాత ఈ డీల్ కంప్లీట్ అయింది.
* మిచెల్ స్టార్క్:
2024 వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన అప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతడు నిలిచాడు.
* వెంకటేష్ అయ్యర్:
భారత జట్టు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని రూ.23.75 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే 2025 సీజన్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది.
హెన్రిచ్ క్లాసెన్:
2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రూ. 23 కోట్లకు హెన్రిచ్ క్లాసెన్ ని రిటైన్ చేసుకుంది. 2023 నుండి SRH మిడిల్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా మారాడు. క్లాసెన్ నిలకడైన ప్రదర్శనతో పాటు భారీ సిక్సర్లు కొట్టే సామర్థ్యం ఉండటంతో SRH అతన్ని ప్రధాన ఆటగాడిగా సెలక్ట్ చేసుకుంది.
* నికోలస్ పూరన్:
ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసకర ఎడమచేతి వాటం వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు నికోలస్ పూరన్. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులో కీలక సభ్యుడైన పూరన్, 2025 వేలంలో రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకున్నారు.
* ప్యాట్ కమిన్స్:
2024 వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అతడు- రూ. 20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుని కెప్టెన్స్ పగ్గాలు అప్పగించింది. దీంతో సారథిగా ఎంపిక అయిన తర్వాత హైదరాబాద్ జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.
* సామ్ కరన్:
2023లో జరిగిన వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ రూ.18.50 కోట్లకు రికార్డు ధరకు అమ్ముడు పోయాడు. కానీ అతడు జట్టులో అశించన మేరకు రాణించకపోవడంతో.. ఆ తర్వాత ఏడాదే కర్రన్ ని తప్పించింది పంజాబ్.
* అర్షదీప్ సింగ్:
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అర్షదీప్ సింగ్ ని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తీవ్రమైన ఉత్కంఠ పోటీలో పంజాబ్ కార్డ్ ఉపయోగించి అతన్ని తిరిగి జట్టులోకి తీసుకుంది.
* యుజ్వేంద్ర చాహల్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ని కూడా పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. చాహల్ కోసం అనేక జట్లు పోటీ పడిన తర్వాత అతన్ని తమ ప్రధాన బౌలర్ గా సెలక్ట్ చేసుకుంది పంజాబ్.
* మతీషా పతిరణ:
ఐపీఎల్ 2026 మినీ వేలంలో శ్రీలంక పేసర్ పతిరణపై కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్ తో పోటీ జరిగిన తర్వాత అతడ్ని కేకేఆర్ దక్కించుకుంది.
