గ్యాస్ సంక్షోభం : ముంబై వడా పావ్ ఫేమస్ హోటల్ మూసివేత..!

గ్యాస్ సంక్షోభం : ముంబై వడా పావ్ ఫేమస్ హోటల్ మూసివేత..!

గ్యాస్ సంక్షోభం మామూలుగా లేదు. దేశంలోని అన్ని సిటీల్లో, టౌన్లలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ పొయ్యిలు పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. ముంబైలో ఈ ప్రభావం మరింతగా పడింది. వడా పావ్ అంటే టక్కున గుర్తుకొచ్చే లాడు సామ్రాట్ అనే ఫేమస్ హోటల్ మూత పడటం చర్చనీయాంశంగా మారింది. 

ముంబైలో వడాపావ్ తినాలంటే అందరూ ఎంచుకునేది లాబ్ బాగ్ లోని ఫేమస్ వడాపావ్ హబ్ లాడు సమ్రాట్. ఎల్పీజీ కొరతతో బుధవారం (మార్చి 11) ఈ ఫేమస్ హోటల్ మూతపడటంతో వడాపావ్ లవర్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. రోజుకు వేల మంది విజిట్ చేసే హబ్ మూతపడటం చూస్తుంటే.. గ్యాస్ సమస్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి రోజు వస్తుందని తాము ఊహించలేదని హోటల్ ఓనర్ మారుతి రక్షే కుమారుడు సిద్ధాంత్ రక్షే ఆవేదన వ్యక్తం చేశాడు. 

అయితే ప్రస్తుతానికి కేవలం స్వీట్స్ షాప్ మాత్రం ఓపెన్ చేసే ఉంటుందని ఈ సందర్భంగా చెప్పాడు. లాడు సామ్రాట్ తో పాటు అదే లొకేషన్ లో చించ్ పోక్లీ అనే స్వీట్స్ తయారీ కేంద్రం నడిపిస్తుంటారు. శోభా ఓన్లీ వెజ్, అన్నమయ్య అనే రెండు షాపులు బైకుల్లా దగ్గర నడిపిస్తుంటారు బుధవారం ఈ మూడు మూతపడినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తకథనం ప్రచురించింది. 

ప్రస్తుతం వడాపావ్ షాపులు మూతపడటంతో.. రోజుకు రెండు నుంచి మూడు లక్షల నష్టం వస్తుందని ఓనర్స్ చెబుతున్నారు. బిజెనెస్ లాస్ అయినా మళ్లీ రికవర్ అవుతుందనీ.. కానీ వర్కర్ల పరిస్థితేంటని రక్షే ఆవేదన వ్యక్తం చేశాడు. 

ALSO READ : H-1B వీసా కష్టాలు

ఇటుక ఇటుక పేర్చీ..

లాడూ సామ్రాట్ వడపావ్ హబ్ కు పెద్ద చరిత్రే ఉంది. రక్షే తాత లాల్ బాగ్ లో 1967 లో లాడూ సమ్రాట్ షాపును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత స్టోర్ కూలిపోయి కొన్నాళ్లు బిజెనస్ నడవలేదని.. కానీ రక్షే తండ్రి 1991లో మళ్లీ బ్రాండ్ ను పునరుద్ధరించినట్లు చెబుతున్నాడు. 

ఇండియాకు రావాల్సిన 85 శాతం చమురు, గ్యాస్ హార్మూజ్ జలసంధి నుంచే రావాలి. అయితే అక్కడి నుంచి నౌకలను అనుమతించబోమని ఇరాన్ పేర్కొనడంతో ఇండియా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా వంట గ్యాస్ కొరతతో ఎంతో ఫేమస్ అయిన హోటల్స్ కూడా మూత పడాల్సి వస్తోంది.