మనం ఆరోగ్యానికి మంచిదని నమ్మి ఫ్రిజ్‌లో దాచుకునే కొన్ని పదార్థాలు నిజానికి మన గుండెను దెబ్బతీస్తున్నాయని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. ప్యాకెట్ల మీద నేచురల్ లేదా హెల్తీ అని రాసి ఉన్నా, వాటి వల్ల రక్తంలో చక్కెర, చెడు కొవ్వులు పెరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు.
1. ఫ్లేవర్డ్ పెరుగు
పెరుగు ఆరోగ్యానికి మంచిదే, కానీ కంపెనీలు రకరకాల రుచులతో అమ్మే పెరుగులో పంచదార ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఫ్లేవర్డ్ పెరుగులో దాదాపు 20 నుండి 25 గ్రాముల పంచదార ఉంటుంది. ఇది పెరుగు కంటే తీపి పదార్థంతో సమానం. దీనివల్ల బరువు పెరగడం, గుండె జబ్బుల ప్రమాదం ఉంటుంది. సాదా పెరుగు లేదా అందులో మీకు కావాలంటే ఫ్రెష్ పండ్ల ముక్కలు కలుపుకోని తినడం మేలు.
2. బాటిల్ స్మూతీలు, జ్యూస్‌లు
పండ్ల రసాలు డీటాక్స్ డ్రింక్స్‌గా బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ పండ్లను రసంగా మార్చినప్పుడు అందులోని ఫైబర్/ పీచు పదార్థం పోతుంది. ఫైబర్ లేని పండ్ల రసం తాగడం అంటే కేవలం పంచదార నీళ్లు తాగడమే. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి పెంచి, గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. జ్యూస్‌లు తాగడం కంటే పండ్లను నేరుగా తినడమే ఉత్తమం.
3. బయట కొన్న సలాడ్ డ్రెస్సింగ్‌లు
సలాడ్ తినడం చాలా మంచి అలవాటు. కానీ దాని రుచి కోసం మనం పైన వేసుకునే 'డ్రెస్సింగ్' అంటే క్రీమ్స లేదా సాస్‌లు ఆరోగ్యానికి చేడు చేస్తాయి. షాపుల్లో దొరికే డ్రెస్సింగ్‌లలో విత్తన నూనెలు (Seed Oils), పంచదార, ఎక్కువ రోజులు ఉండటానికి వాడే కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంటను పెంచి గుండె జబ్బులకు కారణమవుతాయి.
ఈ పదార్థాలను అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కానీ, రోజూ అలవాటుగా చేసుకుంటేనే ప్రమాదం. ఏదైనా కొనే ముందు ప్యాకెట్ వెనుక ఉన్న "పౌష్టికాహార పట్టిక" (Nutrition Label) చదవడం అలవాటు చేసుకోండి. కేవలం మార్కెటింగ్ ప్రకటనలను నమ్మి మోసపోవద్దు.
