అమెరికా వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ యంత్రాంగం దూకుడు పెంచింది. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో వంటి 16 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సెక్షన్ 301 కింద విచారణ ప్రారంభించినట్లు అమెరికా వెల్లడించింది.
అమెరికా ఎగుమతులకు ఈ దేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయా? లేదా ఇతర అనుచిత వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయా? అనే అంశంపై అమెరికా దృష్టి పెట్టింది. ఈ విచారణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి.. మరో నెల రోజుల్లో కొత్త టారిఫ్ విధించే అవకాశం ఉందని యూఎస్ టీఆర్ జేమీసన్ గ్రీర్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. చైనాతో ఇప్పటికే ఉన్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ధోరణి చూస్తుంటే.
