క్రెడిట్​ కార్డ్​ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..

క్రెడిట్​ కార్డ్​ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..

క్రెడిట్​ కార్డు .. వీటిని దాదాపు అన్ని బ్యాంకులు ఆఫర్​ చేస్తుంటాయి.  పెద్ద పెద్ద షాపింగ్​ మాల్స్ ఎదుట కొన్ని బ్యాంకులు క్రెడిట్​ కార్డు సేల్స్​ మెన్స్​ కూడా ఉంటారు.  కొంతమంది జనాలు కొత్తది ఏది వచ్చినా వచ్చినా వదలిపెట్టరు.. అది వారికి అవసరం లేకపోయినా తీసుకుంటారు.  అయితే క్రెడిట్ కార్డులను తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం నష్టాలను చూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.  . కొందరు అవసరం ఉన్నా లేకున్నా కూడా తీసుకుంటారు. ఇక బ్యాంకులు కూడా తమ సేల్స్ పెంచుకోవడం కోసం కార్డులను జారీ చేస్తుంటారు.క్రెడిట్​ కార్డు  ఉంది కదా అని అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్​ చేస్తూ.. తెగ  గీకేస్తుంటారు.  

ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులను చెల్లిస్తారు.. క్రెడిట్ కార్డులతో కొన్ని మాత్రం కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్స్ వస్తాయి. డైనింగ్, ట్రావెల్, కిరాణా లేదా ఇంధనం వంటి నిర్దిష్ట ఖర్చు వర్గాలకు అనుగుణంగా వివిధ రివార్డ్‌లు, ప్రయోజనాలను అందిస్తాయి. ఎక్కడ ఉపయోగిస్తే రివార్డ్స్ ఎక్కువగా వస్తాయో ముందుగా తెలుసుకోవాలి.. అక్కడ మాత్రమే కార్డులను వాడటం మంచిది..

 క్రెడిట్ కార్డుల బిల్లును కరెక్ట్ టైంకు చెల్లించాలి.. లేకుంటే అదనపు డబ్బులను చెల్లించాలి.. ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ అవి అధిక వార్షిక రుసుములతో రావచ్చు. వార్షిక రుసుమును చెల్లించడాన్ని సమర్థించడానికి మీ వినియోగ ఫ్రీక్వెన్సీని, ఈ ప్రయోజనాల నుంచి మీరు పొందిన విలువను పరిగణించాలి. యాన్యూవల్ ఫీ తక్కువగా ఉన్న కార్డులను మాత్రమే తీసుకోవాలి..

క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకున్నప్పుడు చాలా మంది వ్యక్తులు వడ్డీ రేట్లను పట్టించుకోరు. కేవలం రివార్డ్‌లు, ప్రయోజనాలపైనే దృష్టి పెడతారు.. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి.. లేకుంటే భారాన్ని మోయాల్సి వస్తుంది.. బలమైన భద్రతా ఫీచర్‌లతో క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకోవాలి. కార్డ్ జారీచేసేవారి మోసం ను నియంత్రించే శక్తి ఉందో లేదో కనుక్కోవాలి..ఇవే కాదు ఒకేసారి వివిధ కార్డులను అస్సలు తీసుకోవడం మంచిది కాదు. అందుకే కార్డులను తీసుకొనే ముందు అన్ని తెలుసుకోవడం మంచిది..