ఫోర్టిస్ హెల్త్ కేర్ చేతికి పీపుల్ ట్రీ హాస్పిటల్

ఫోర్టిస్ హెల్త్ కేర్ చేతికి పీపుల్ ట్రీ హాస్పిటల్

బెంగళూరు: ఫోర్టిస్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్.. బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న పీపుల్ ట్రీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను రూ.430 కోట్లకు కొంటున్నట్టు శనివారం ప్రకటించింది. యశ్వంత్‌‌‌‌‌‌‌‌పూర్​లో 125 బెడ్స్​తో నడుస్తున్న ఈ ఆసుపత్రిని పూర్తిగా తన సొంతం చేసుకునేందుకు ఫోర్టిస్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. పీపుల్ ట్రీ హాస్పిటల్ వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించే టీఎంఐ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్​లో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. 

ఈ భారీ కొనుగోలు ప్రక్రియను ఫోర్టిస్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ పూర్తిగా తన అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ హాస్పిటల్ లిమిటెడ్ ద్వారా చేపడుతోంది. రాబోయే మూడేళ్లో ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం అదనంగా రూ.410 కోట్లు పెట్టుబడి పెడుతుంది.  మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం సహా బెడ్స్​ను పెంచడం, అత్యాధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేయడం వంటి పనులు చేపడుతుంది. రేడియేషన్ ఆంకాలజీ వంటి విభాగాలను ప్రారంభిస్తామని ఫోర్టిస్ తెలిపింది.