హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్, ఎయిర్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే ఏకైక బీ2బీ అంతర్జాతీయ ప్రదర్శన ‘ఫ్యాన్ ఎక్స్‌పో’ వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరగనుంది.
సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ ట్రేడర్స్ అసోసియేషన్ (సెటా) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా ఉన్న 120కు పైగా ఫ్యాన్ తయారీ సంస్థలు పాల్గొననున్నాయి.
కార్యక్రమానికి దాదాపు 10 వేల మందికి పైగా వ్యాపార సందర్శకులు, పది వేలకు పైగా బిజినెస్ విజిటర్లు హాజరవుతారని అంచనా. ఎక్స్‌పోలో భాగంగా ‘ఫ్యాన్ ఇండియా సమ్మిట్’ కూడా నిర్వహించనున్నారు.
కొత్త టెక్నాలజీలు, మార్కెట్ అవకాశాలపై చర్చించనున్నారు. ఇది సమాచార మార్పిడి, వ్యాపార విస్తరణకు వేదికగా నిలవనుందని సెటా తెలిపింది.
