హైదరాబాద్, వెలుగు: మనరాష్ట్రంలో హైవే పక్కన ఉండే డాబాలకు, కిరాణాలకు సాయం చేయడానికి హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోకల్లీ యువర్స్ ప్రచారాన్ని శనివారం ప్రారంభించింది.
చిరు వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక రిటైల్ పరికరాలను సంస్థ అందిస్తోంది. కూలింగ్ ఎక్విప్‌మెంట్, కోక్ బడ్డీ వంటి ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల స్టాక్ ఆర్డర్ చేయడం, ఇన్వెంటరీ నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపింది.
