హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఎడ్యుకేషన్ సంస్థ.. విరోహన్కు రూ.65 కోట్ల పెట్టుబడులు

హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఎడ్యుకేషన్ సంస్థ.. విరోహన్కు రూ.65 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్​, వెలుగు: హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఎడ్యుకేషన్ సంస్థ విరోహన్ తన సిరీస్ బీ నిధుల సేకరణలో భాగంగా రూ.65 కోట్లు సమీకరించింది. జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన మైనావి కార్పొరేషన్, బ్లూమ్ వెంచర్స్ నేతృత్వంలో ఈ పెట్టుబడులు వచ్చాయి. ఈ నిధుల సేకరణలో భారత్ ఇంక్లూజివ్ టెక్నాలజీస్ సీడ్ ఫండ్, రీబ్రైట్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్ వంటి పాత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. 

ఈ నిధులను ఉత్పత్తి ఆవిష్కరణలు, కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకోవడానికి విరోహన్ వినియోగించనుంది. తద్వారా సంస్థను లాభాల బాటలో నడిపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విరోహన్ సంస్థ డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని యూపీఈఎస్, లక్నోలోని బీబీడీ యూనివర్సిటీ, బెంగళూరులోని సీఎంఆర్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. అలైడ్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్, నర్సింగ్, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.