న్యూఢిల్లీ, వెలుగు: భారత రత్న, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ‘వీర్ భూమి’ (రాజీవ్ గాంధీ సమాధి) వద్ద పుష్పగుచ్ఛం ఉంచి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రధానిగా దేశ అభివృద్ధి, సాంకేతిక రంగ ప్రగతి, యువత సాధికారత కోసం చేసిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు.
