ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్​

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్​

పరిగి, వెలుగు: పట్టాదారు పాసుబుక్​ఆన్ లైన్​చేసేందుకు డబ్బులు తీసుకుంటూ పరిగి డిప్యూటి తహసీల్దార్​ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగికి చెందిన వార్ల సూర్యకుమారికి రెండెకరాల పొలం ఉంది. ఎకరాలో రైస్​ మిల్లు ఉండగా, మిగతా ఎకరాను నాలా కింద మార్చి ఆన్​లైన్​ చేయాలంటూ ఆరు నెలల క్రితం  దరఖాస్తు చేశారు.

డిప్యూటి తహసీల్దార్​ వాజేష్​ ఇవాళ రేపు అంటూ కాలయాపన చేసి లంచం అడిగాడు. సూర్యకుమారి కొడుకు సతీష్​ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం వికారాబాద్​ కలెక్టర్​ కార్యాలయం వద్ద ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.