టాప్‌‌ గేర్‌‌‌‌లో  రియల్ ఎస్టేట్

టాప్‌‌ గేర్‌‌‌‌లో  రియల్ ఎస్టేట్

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: రియల్ ఎస్టేట్‌‌‌‌ ఇండస్ట్రీ గ్రోత్‌‌‌‌ బాట పట్టింది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఈ ఇండస్ట్రీ  మంచి పనితీరు కనబరుస్తోంది. రియల్టీ సబ్‌‌‌‌సెక్టార్లయిన వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్‌‌‌‌, డేటా సెంటర్స్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌ వంటి వాటిలో కూడా ఇన్వెస్ట్‌‌మెంట్లు పెరుగుతున్నాయి. కేవలం ఇండియానే కాదు యూఎస్‌‌‌‌, యూరప్ మార్కెట్లలో కూడా రియల్టీ సెక్టార్ ఊపందుకుంటోంది. విదేశీ కంపెనీలు సైతం ఇండియన్ రియల్టీ సెక్టార్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదనే స్థాయికి ఎదిగామంటేనే పరిస్థితుల్లో మార్పొచ్చిందని అర్థం చేసుకోవచ్చు. రానున్న కొన్నేళ్లలో  ఈ సెక్టార్ మరింత వృద్ధి చెందుతుందని  ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు. ప్రాపర్టీల ధరలు నెమ్మదిగా పెరుగుతుండడమే దీనికి రుజువంటున్నారు. 

రియల్టీకి ‘యంగ్‌’ జోష్‌‌‌‌

వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానంతో రియల్టీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు  బూస్ట్ వచ్చిందని  చెప్పొచ్చు. ఈ విధానంతో ఆఫీస్‌‌‌‌లు క్లోజయినా, టైర్‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీల్లో ఇండ్ల కొనుగోళ్లు పెరిగాయి. కంపెనీలు కూడా  ఫిజికల్‌‌‌‌గా ఆఫీస్‌‌‌‌లను మెయింటెయిన్ చేయడంతో పాటు, వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానాన్ని కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నాయి. అంటే భవిష్యత్‌‌‌‌లో కూడా  వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానం ఉంటుంది.  దీంతో హౌసింగ్‌‌‌‌, రెంటల్స్‌‌‌‌ సెగ్మెంట్లలో  డిమాండ్ ఊపందుకుంటుంది.  ప్రాపర్టీలను కొనడంలో యంగ్ బయ్యర్లు ముందుంటున్నారని  ప్రాపర్టీ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్‌‌ ప్రకటించింది. మిగిలిన సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొనడానికి   యంగ్ బయ్యర్లు ముందుకొస్తున్నారని పేర్కొంది. ‘హైదరాబాద్‌‌లో ప్రాపర్టీలు కొనాలనుకునే వారిలో 25–35 మధ్య ఏజ్ ఉన్నవాళ్ల వాటా  39 శాతంగా ఉంది. వీరి ఆదాయాలు కూడా బాగున్నాయి. ముంబై మెట్రో పాలిటిన్‌‌ రీజియన్ (16 శాతం), ఎన్‌‌సీఆర్‌‌‌‌ (15 శాతం), బెంగళూరు (21 శాతం), పుణే (28 శాతం ) లతో పోలిస్తే హైదరాబాద్‌‌లోనే యంగ్ బయ్యర్లు ఎక్కువగా ఉన్నారు’  అని  అనరాక్‌‌ చైర్మన్ అనుజ్‌‌ పురి అన్నారు. 

కలిసొస్తున్న ప్రభుత్వ పాలసీలు..

ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు రియల్టీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఆగిపోయిన ప్రాజెక్ట్‌‌‌‌లకు ఫండింగ్ అందించడం, కొన్ని రాష్ట్రాలలో స్టాంప్‌‌‌‌డ్యూటీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీజును తొలగించడం వంటివి రియల్టీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌గా నిలుస్తున్నాయి. వీటికి తోడు బ్యాంకులు తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్లను ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తుండడం, డెవలపర్లు ఆకర్షణీయమైన స్కీమ్‌‌‌‌లను తెస్తుండడం రియల్టీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. కీలకమైన సిటీల్లో ప్రాపర్టీల గురించి ఎంక్వైరీలు పెరిగాయి. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2020–మార్చి 2021 మధ్య రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, సేల్స్ కీలకమైన సిటీలలో పెరిగాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా లాంచ్ అయిన ప్రాపర్టీలు ఆరు లక్షల యూనిట్లకు చేరుకున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

ఉద్యోగులకు హైక్‌‌‌‌..రియల్టీకి బూస్ట్‌‌‌‌

ఐటీ ఇండస్ట్రీలో ఎట్రిషన్‌‌‌‌ (జాబ్‌‌‌‌ మానేయడం ) ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 8.03 శాతానికి పెరిగింది. ఈ సెక్టార్ తర్వాత ఎడ్యుకేషన్ సర్వీసెస్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ 7.45 శాతం ఎట్రిషన్ రేటుతో రెండో పొజిషన్‌‌‌‌లో ఉంది. కంపెనీలు కూడా తమ ఉద్యోగులు జాబ్‌‌‌‌ మానేయకుండా చూడడానికి 10–15 శాతం వరకు శాలరీ హైక్ చేపట్టాలని చూస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. హౌసింగ్ సేల్స్ పెరగడానికి ఇదొక కారణంగా ఉంటుందని  ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కేవలం పెంటప్‌‌‌‌ డిమాండ్ (ఒక్కసారిగా వచ్చే డిమాండ్‌‌‌‌ ) మాత్రమే కాకుండా, స్ట్రక్చరల్‌‌‌‌గా కూడా హౌసింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు. మొదటి సారిగా ఇళ్లు తీసుకోవాలనుకునే వారు, పెద్ద ఇళ్లను తీసుకోవాలనుకునే వారు పెరుగుతున్నారు. ఇళ్లు మారాలనుకునే వారి నుంచి కూడా హౌసింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ క్రియేట్అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, అహ్మదాబాద్‌‌‌‌, బెంగళూరు, చెన్నై, కోల్‌‌‌‌కతా, ముంబై , ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, పుణే మార్కెట్లలో హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌కు ఫుల్ డిమాండ్ ఉంది.

రూ. 74.2 లక్షల కోట్లకు  రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌... 

 రియల్‌‌ ఎస్టేట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ట్రస్ట్‌‌ (రైట్‌‌) ప్లాట్‌‌ఫామ్‌‌ను సెబీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న కొన్నేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లు (19.65 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తాయని అంచనావేస్తున్నారు.  రైట్ ద్వారా రియల్‌‌ఎస్టేట్‌‌ ప్రాపర్టీలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టొచ్చు. వారికి డివిడెండ్స్ వస్తాయి. ప్రాపర్టీ వాల్యూ పెరిగితే వెల్త్‌‌ క్రియేట్ అవుతుంది కూడా.  ప్రభుత్వం కూడా రియల్‌‌ ఎస్టేట్‌‌ సెక్టార్‌‌‌‌కు బూస్టప్ ఇచ్చేలా స్కీమ్‌‌లు తీసుకొస్తోంది. కేంద్రం తెచ్చిన 100 స్మార్ట్ సిటీలు ప్రాజెక్ట్‌‌తో రియల్‌‌ ఎస్టేట్‌‌ సెక్టార్‌‌‌‌కు మంచి అవకాశాలు క్రియేట్ అవుతాయి. ప్రధాన్ మంత్రి అవాస్ యోజన కింద 2 కోట్ల అఫోర్డబుల్ హౌస్‌‌లను 2022 నాటికి కట్టాలని ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుంది. రానున్న కొన్నేళ్లలో అర్బన్ ప్రాంతాల్లో ఇండ్లు పెరుగుతాయి. దీంతో కమర్షియల్ అండ్ రిటైల్ ఆఫీస్‌‌ స్పేస్‌‌లకూ డిమాండ్‌‌ క్రియేట్ అవుతుంది.  2030 నాటికి దేశ రియల్ ఎస్టేట్‌‌ సెక్టార్రూ. 74.20 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.  2025 నాటికి దేశ జీడీపీలో 13 శాతం వాటా ఈ సెక్టారే ఉంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రియల్‌‌ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌లోకి ఎఫ్‌‌డీఐల ఇన్‌‌ఫ్లో పెరుగుతుండడం, రేరా చట్టంతో పారదర్శకత పెరగడం వంటివి ఈ సెక్టార్‌‌‌‌ గ్రోత్‌‌కు మరింత తోడ్పడతాయి.