పిల్లల కెమెరా

పిల్లల కెమెరా

పిల్లల కెమెరా

మార్కెట్ లోకి ఎప్పుడూ కొత్తగా గాడ్జెట్స్ వస్తూనే ఉంటాయి. ఇన్నొవేటివ్ ఐడియాలతో, స్మార్ట్ టెక్నాలజీతో తయారు చేసిన, మనకు రెగ్యులర్ గా అవసరమయ్యే కొన్ని గాడ్జెట్స్ వివరాలు ఇక్కడ ఇస్తున్నాం. అందులో మీకు పనికొచ్చేది ఉంటే ఓ లుక్కేయండి! 

వైఫై యాంటెన్నా 

ఇప్పుడొచ్చే లేటెస్ట్​ కంప్యూటర్లలో వైఫై ఆప్షన్​ ఉంటుంది. కానీ.. పాత కంప్యూటర్లలో చాలావాటికి వైఫై ఆప్షన్​ ఉండదు. అలాంటివాటికి కేబుల్​ ద్వారానే నెట్​ కనెక్షన్​ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఈ చిన్న డివైజ్​ని కంప్యూటర్​కి కనెక్ట్​ చేసి వైఫైతో కూడా ఇంటర్నెట్​ వాడుకోవచ్చు. దీన్ని టీపీ లింక్ కంపెనీ తీసుకొచ్చింది. ఇది విండోస్​, మ్యాక్​ ఓఎస్​లలోని అన్ని వెర్షన్లకు సపోర్ట్​ చేస్తుంది. 256QAM సపోర్ట్, 433Mbps స్పీడ్​ వరకు సపోర్ట్​ చేస్తుంది. 2.4 GHz, 5 GHz డ్యుయల్​ బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది. దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. కంప్యూటర్​కు ఉండే యూఎస్​బీ పోర్ట్​కి కనెక్ట్​  చేస్తే సరిపోతుంది. ధర: 1,199 రూపాయలు

కప్​బోర్డ్​ లైట్​

చీకట్లో కప్​బోర్డ్​లో ఉండే వస్తువులు సరిగా కనిపించవు. రూమ్​లో ఉన్న లైటింగ్​తో  కప్​బోర్డ్ లోపల అన్ని వైపుల వెలుతురు రాదు. అలాంటప్పుడు ఈ మినీ ల్యాంప్​ బాగా పనిచేస్తుంది. ఇది చాలా కాంపాక్ట్​గా ఉంటుంది. ఎక్కడైనా స్టిక్​ చేసి వాడుకోవచ్చు. కవచ్​ అనే కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. లైట్​ మధ్యలో ఒకసారి టచ్​ చేస్తే ఆన్​ అవుతుంది. మరోసారి టచ్​ చేస్తే ఆఫ్​ అవుతుంది. ఇందులో ఆరు ఎల్​ఈడీ లైట్లు ఉంటాయి. ఒకసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే ఒకటిన్నర గంటలు పనిచేస్తుంది. కరెంట్​ లేనప్పుడు స్టడీ ల్యాంప్​గా కూడా పనిచేస్తుంది. కొందరు పెడెల్స్​ కనిపించకపోతే కారు డ్రైవ్​ చేయలేరు. అలాంటప్పుడు దీన్ని పెడెల్​ దగ్గర పెడితే సరిపోతుంది. కార్ ఇంటీరియర్ లైట్​గా కూడా వాడుకోవచ్చు.  ధర: 599 రూపాయలు

స్మార్ట్ క్లిక్స్​

పిల్లలు ఇప్పుడు స్మార్ట్​ వరల్డ్​లో ఉంటున్నారు. కొందరు పిల్లలైతే గాడ్జెట్స్​ని పెద్దవాళ్లకంటే బాగా హాండిల్​ చేస్తారు. అలాంటి స్మార్ట్​ కిడ్స్​ కోసం డిజైన్​ చేసిందే ఈ కిడ్స్​ కెమెరా. ఫొటోలు తీయాలనే ఇంట్రెస్ట్​ ఉన్న పిల్లలకి ఇది బెస్ట్​ ఆప్షన్​. వేలకు వేలు పెట్టి స్మార్ట్​ఫోన్​ కొనిచ్చే బదులు ఈ కెమెరా కొనిస్తే సరిపోతుంది. ‘‘రింబో టాయ్స్” ఈ కిడ్స్​ కెమెరాని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీంతో ఫొటోలు తీయడంతోపాటు 1080P క్వాలిటీతో వీడియో రికార్డ్​ చేయొచ్చు. ఇందులో 3.0 మెగా పిక్సెల్‌‌‌‌ కెమెరా ఉంటుంది. దీనికి యాంటీ-డ్రాప్ సాఫ్ట్ సిలికాన్ షెల్‌‌‌‌ ఉండడం వల్ల పిల్లల చేతుల నుంచి జారిపడదు. ప్లేబ్యాక్, కౌంట్‌‌‌‌డౌన్ ఫొటో, స్టిక్కర్ ఫొటో లాంటి ఆప్షన్స్​ కూడా ఉంటాయి. అందమైన ఫొటో ఫ్రేమ్స్​ కూడా ఇన్​బిల్ట్​గా వస్తాయి. 32జీబీ మైక్రో ఎస్​డీ కార్డ్‌‌‌‌ వరకు సపోర్ట్​ చేస్తుంది. ఐదు పజిల్ గేమ్స్​ కూడా ఉన్నాయి. ధర: 1,099 రూపాయలు

కేబుల్​ సెట్​

ఇంట్లో రకరకాల గాడ్జెట్స్​ వాడుతుంటాం. ఒక్కోదానికి ఒక్కో రకమైన ఛార్జింగ్​ కేబుల్ ఉంటుంది. అలాంటి గాడ్జెట్స్​ తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ కేబుల్స్​ అన్ని తీసుకెళ్లాలి.  కానీ.. ఈ కేబుల్​ కిట్​ ఉంటే అవేవీ అవసరం లేదు. ఇందులోనే దాదాపు ఇంట్లో వాడే అన్ని రకాల గాడ్జెట్స్​కి సరిపడా చిన్న సైజు కేబుల్స్​ ఉంటాయి. ‘లెవ్​గ్రీ’ అనే కంపెనీ ఈ కేబుల్​ స్టోరేజ్ కేస్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఒక చిన్న క్యారీ కేస్​లోనే అన్ని రకాల కనెక్టింగ్​ కేబుల్స్​ ఉంటాయి.  ఆ కేస్​ని ఫోన్​ హోల్డర్​లా కూడా వాడుకోవచ్చు. ఇందులో ఉండే కేబుల్​ 60 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​కి కూడా సపోర్ట్​ చేస్తుంది. ఒక ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్, టైప్ సీ నుంచి సీ, టైప్ పీ నుంచి లైట్నింగ్​, టైప్ సీ నుంచి మైక్రో కేబుల్స్​తోపాటు కార్డ్ పిన్ ఉంటాయి. కేస్​లో  ఎస్​డీ స్లాట్, టీఎఫ్​ కార్డ్ స్లాట్లు కూడా ఉంటాయి. ధర: 999 రూపాయలు