IPL 2024: అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్న రోహిత్, హార్దిక్.. ఎప్పుడంటే..?

IPL 2024: అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్న రోహిత్, హార్దిక్.. ఎప్పుడంటే..?

ఐపీఎల్ మ్యాచ్ లు క్లైమాక్స్ కు చేరిపోయాయి. మరో రెండు వారాల్లో టోర్నీ పూర్తవుతుంది. ఈ మెగా లీగ్ తర్వాత ప్రపంచ క్రికెటర్లందరూ టీ20 వరల్డ్ కప్ లో ఆడుతూ బిజీగా మారనున్నారు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు మొదట అమెరికా వెళ్లనున్నారు. లీగ్ మ్యాచ్ లు అన్ని ఇక్కడే ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెండు విడతలుగా అమెరికా బయలుదేరుతుంది. ప్లే ఆఫ్ కు వెళ్లని జట్ల ఆటగాళ్లు మే 24 న మొదటి బ్యాచ్ గా అమెరికాకు ప్రయాణమవుతారని జైషా కన్ఫర్మ్ చేశాడు. 

ముంబై జట్టు ఇప్పటికే ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ కావడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యతో పాటు  సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తొలి బ్యాచ్ గా అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఓడిపోవడంతో పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో టీమిండియా స్క్వాడ్ లో ఉన్న అర్షదీప్ సింగ్ వీరితో కలిసి వెళ్తాడు. గుజరాత్ కూడా ఎలిమినేట్ కు దగ్గరలో ఉండడంతో ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా ఉన్న గిల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. 

మెగా టోర్నీకి ముందు అన్ని టీమ్స్ పూర్తి స్క్వాడ్స్​తో రెండు వార్మప్ మ్యాచులు ఆడతాయి. అందుకే ఐపీఎల్ ప్లేఆఫ్స్ టైమ్​లోనే ఫస్ట్ బ్యాచ్ భారత ఆటగాళ్లు యూఎస్ వెళ్లనున్నారు. దీంతో మన స్టార్ ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభిస్తుంది. నాకౌట్స్‌లో ఆడే క్రికెటర్లు మే 27 లేదా 28వ తేదీన అమెరికాకు బయలుదేరే అవకాశం ఉంది.