మూడు రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం. ఇరాన్ దిగి వస్తే.. చర్చలు జరపటానికి సిద్ధం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఇచ్చిన ఆఫర్ పై ఫస్ట్ టైం ఇరాన్ స్పందించింది..
‘‘మాటల్లేవ్.. మాట్లాడుకోవటం లేదు.. అమెరికా, ఇజ్రాయెల్ తో చర్చలు జరిపే ఆలోచన లేదు.. యుద్ధం కొనసాగిస్తాం.. యుద్ధం చేస్తాం.. యుద్ధం ఆపండి బాబూ అనే వరకు యుద్ధం చేస్తాం’’ అంటూ తేల్చిచెప్పింది ఇరాన్. టెహ్రాన్ కేంద్రంగా ఈ ప్రకటన విడుదల చేసింది ఇరాన్. యుద్ధం కొనసాగింపునకు.. యుద్ధం చేయటానికే ఇరాన్ సిద్ధం కావటంతో.. ఇజ్రాయెల్, అమెరికా దూకుడు ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. దాడులను తీవ్రం చేయటం ఖాయంగా కనిపిస్తుంది.
ఇరాన్ తో అణు చర్చలు తిరిగి ప్రారంభించటానికి కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు అమెరికా మీడియా వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. అణు చర్చలపై ఎలాంటి సమాచారం లేదని తేల్చిచెప్పింది ఇరాన్. మా దేశం గుండెలపై బాంబులు కురిపించారు.. ఇలాంటి వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదని.. యుద్ధం కొనసాగిస్తామని.. యుద్ధం వాళ్లు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం అని గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని స్పష్టం చేశారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవటం లేదని.. యుద్ధం ముగింపు మా చేతుల్లోనే ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్పారు అలీ.
🚨 BREAKING: Iran says NO talks with the U.S.
— Whale Degen (@hiwhaledegen) March 2, 2026
Iran’s security chief, Ali Larijani, clearly said the country will not negotiate with America.
This directly denies a recent WSJ report and also rejects Trump’s claim that Iran’s new leadership had reached out pic.twitter.com/z730UB2vod
ఇజ్రాయెల్తో యుద్ధం కీలక దశకు చేరుకున్న సమయంలో రాజీకి ఇరాన్ ససేమిరా అని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల ప్రతిపాదనకు ఇరాన్ నిర్మొహమాటంగా నో చెప్పేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ దేశం ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. ఇరాన్లో కొన్ని వేల మంది రోడ్ల మీదకు వచ్చి ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఇరాన్ డిసైడ్ అయింది.
ఇరాన్కు లెబనాన్ కూడా ఇప్పుడు తోడు కావడంతో యుద్ధం తారా స్థాయికి చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్కు ఇరాన్, లెబనాన్ కౌంటర్ అటాక్స్ చేస్తున్నాయి. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు రగిలిపోతున్నారు. ఖమేనీ మృతి చెందిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పై లెబనాన్ దాడి చేసింది. లెబనాన్ దాడులకు ఇజ్రాయెల్ కూడా బదులిచ్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ లో 30 మందికి పైగా చనిపోయారు. 149 మందికి పైగా గాయపడ్డారు.
