మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి స్వాధీనం.. కియా కారులో సప్లై చేస్తున్న ఇద్దరు అరెస్ట్..

మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి స్వాధీనం.. కియా కారులో సప్లై చేస్తున్న ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ( మార్చి 2 ) అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు కియా కారులో గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి స్మగ్లర్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కియా కారులో గంజాయి తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర  ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన నభిన్ సభర్,సుద్కర్ మండల్ గా గుర్తించారు పోలీసులు.

నిందితుల నుంచి 164 కేజీల గంజాయి,కీయా  కారు స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటి పోలీసులు. ఒడిశా నుండి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ మీదుగా  కర్ణాటక,మహారాష్ట్ర స్టేట్ లో సప్లై చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర వెహికిల్ చెకింగ్ లో భాగంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. 

నిందితులు అనుమానం రాకుండా ఓఆర్ఆర్ వరకు కీయా కారులో గంజాయి తీసుకువచ్చి సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.