పశ్చిమాసియా దేశాల్లో కోటి మంది భారతీయులు : ఈ నెంబర్లకు కాల్ చేస్తే.. మీ వాళ్లు ఎలా ఉన్నారో తెలుస్తుంది..!

పశ్చిమాసియా దేశాల్లో కోటి మంది భారతీయులు : ఈ నెంబర్లకు కాల్ చేస్తే.. మీ వాళ్లు ఎలా ఉన్నారో తెలుస్తుంది..!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న దాదాపు 96 లక్షల మంది భారతీయుల రక్షణ కోసం భారత ప్రభుత్వం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. యుద్ధం లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న భారతీయులు వైద్య సాయం, భద్రత లేదా తరలింపు కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు.

 పాలస్తీనా, ఖతార్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్ సహా ఇరాక్‌లో నివసిస్తున్న భారతీయుల ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

పాలస్తీనాలోని రామల్లాలో +970592916418కు ఫోన్ ద్వారా లేదా [email protected], [email protected] ద్వారా సహాయం పొందోచ్చు. ఖతార్‌లోని దోహాలో ఉండే  భారతీయులు 00974-55647502కు కాల్ చేయవచ్చు లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు.

సౌదీ అరేబియాలో ఉన్నవారు రియాద్ మిషన్‌  00-966-11-4884697 నంబర్‌ కాల్ చేసి  సంప్రదించవచ్చు, వాట్సాప్ హెల్ప్‌లైన్ కోసం  00-966-542126748, టోల్-ఫ్రీ నంబర్ 800 247 1234 ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్ మిషన్ సహాయం కోసం +972-54-7520711, +972-54-2428378 నంబర్‌లతో పాటు [email protected]  ద్వారా సంప్రదించొచ్చు. 

టెహ్రాన్ లో ఉండే భారతీయులు  +989128109115, +989128109109, +989128109102, +989932179359  అత్యవసర నంబర్లు కాల్స్ చేసి సంప్రదించొచ్చు. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అబుదాబి మిషన్ భారతీయుల కోసం [email protected], [email protected]లతో పాటు టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 800-46342, వాట్సాప్ నంబర్ +971543090571ను జారీ చేసింది.

కువైట్‌ భారతీయుల కోసం   +96565501946కు ఫోన్ ద్వారా.... [email protected] కు ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. బహ్రెయిన్‌ లో ఉండే భారతీయులు  హెల్ప్‌లైన్ నంబర్ 00973-39418071 కాల్  చేయవచ్చు.

ఒమన్  కూడా [email protected], [email protected]లతో పాటు 80071234 టోల్-ఫ్రీ నంబర్,  +96898282270 వాట్సాప్ నంబర్ల ద్వారా సంప్రదించొచ్చు.

జోర్డాన్‌లోని భారతీయులు 00962-770 422 276కు కాల్ చేయవచ్చు. ఇరాక్‌లో బాగ్దాద్ మిషన్‌ ద్వారా  +964 771 651 1185, +964 770444 4899 నంబర్లతో  లేదా [email protected], [email protected], [email protected] ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని  వివరాలు బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయం  అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఇవన్నీ వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల (Embassy) సంప్రదింపు నంబర్లు. 

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ హెల్ప్‌లైన్ నంబర్లు జారీ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పైన పేర్కొన్న నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని భారత ప్రభుత్వం సూచించింది. మరిన్ని వివరాల కోసం ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్లను చూడవచ్చు.