T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్‌కు 30 రోజులే.. స్టేడియం ఎలా ఉందంటే..?

T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్‌కు 30 రోజులే.. స్టేడియం ఎలా ఉందంటే..?

వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ పోరు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి దాయాదుల మధ్య సమరానికి అమెరికా ఆతిధ్యం ఇవ్వనుంది. జూన్ 9 న న్యూయార్క్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఐసీసీ ఈ వేదిక ప్రకటించ తర్వాత న్యూయార్క్ స్టేడియం నిర్మించలేదు. అయితే ప్రస్తుతం స్టేడియం నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో స్టేడియం పూర్తి కానుందని సమాచారం.

న్యూయార్క్ లోని నాసావు స్టేడియంలో పని కొనసాగుతుంది. దాదాపు 90 శాతం స్టేడియం పూర్తయిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం స్టేడియం పరిసరాల్లో పని జరుగుతోంది. ఈ వేదికపై మొత్తం 9 జట్లు తమ మ్యాచ్‌లు ఆడనుండగా.. భారత్, పాకిస్థాన్ పోరు అత్యంత కీలకం. ఈ స్టేడియం మొత్తం 34000 వేల సీటింగ్ సామర్ధ్యం కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ICC ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. కాగా వెస్టిండీస్ కూడా సంయుక్తంగా ఆతిధ్యమిస్తుంది.    

ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగక దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఐసీసీ టోర్నీలో దాయాదుల సమరాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  దానికి తగ్గట్టుగానే ఐసీసీ టోర్నీల్లో 2013 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా ఐసీసీ షెడ్యూల్ సిద్ధం చేస్తుంది. తాజాగా 2024 టీ 20 వరల్డ్ కప్ కు సైతం భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ లో ఉండడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.