ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలకు దిన దిన గండంగా మారింది. కువైట్ ఎయిర్ స్పేస్లో అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ క్రాష్ అవడం కలకలం రేపింది. అయితే.. ఈ ఫైటర్ జెట్ పైలట్ సేఫ్గానే ఉన్నాడని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫైటర్ జెట్ క్రాష్ అవడానికి కారణాలు ఏంటనేది ప్రస్తుతానికి తెలియలేదు.
JUST IN: 🇺🇸 Avión de combate F-15 de EE.UU. se estrella en Kuwait. Aparentemente tras "fuego amigo" #USMilitary #Kuwait pic.twitter.com/36DjoMHGsv
— lacherada.com 🇸🇻⚡ (@lacheradacom) March 2, 2026
ఇదిలా ఉండగా.. కువైట్లోని అమెరికా ఎంబసీ అక్కడ ఉన్న అమెరికా పౌరులకు కీలక సూచన చేసింది. కువైట్లో పరిస్థితులు ఏం బాలేదని.. ఎంబసీకి ఎవరూ రావొద్దని.. ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్స్లో తలదాచుకోవాలని.. కిటికీలకు దూరంగా ఉండాలని అమెరికా ఎంబసీ సూచించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సోమవారం ఉదయం కూడా దుబాయ్, అబుదాబి, దోహా, బెహ్రెయిన్, లెబనాన్, ఇజ్రాయెల్, కువైట్లో బాంబులు పేలాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
