భారత చెస్ గ్రాండ్ మాస్టర్ల జాబితాలో మరో యువ కిరణం చేరింది. ముంబయికి చెందిన 17 ఏళ్ల ఆరవ్ మన దేశం నుంచి 93వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. బోస్నియాలో జరిగిన 'జీఎం మిక్స్ బిజెల్ జినా' టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆరవ్ గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన చివరి నార్మ్‌ను దక్కించుకున్నాడు. ఆరవ్ తన ప్రతిభతో 2022లో ఫిడే మాస్టర్ హోదాను, 2024లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతి పిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకుని రికార్డు సృష్టించాడు.
