దమ్ముంటే అదానీ అంబానీలపై ఈడీ రైడ్స్ చేయించాలి : ఖర్గే

దమ్ముంటే అదానీ అంబానీలపై ఈడీ రైడ్స్ చేయించాలి : ఖర్గే

ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. పదేళ్లలో తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఆయన మిత్రులే ధనవంతులు అయ్యారని విమర్శించారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు కట్టబెట్టాడని ఆరోపించారు. మోదీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తానన్నది ఏమయ్యాయని ప్రశ్నించారు. 

మోదీకి దమ్ముంటే అదానీ అంబానీలపై ఈడీ రైడ్స్ చేయించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం తమకు అండగా ఉంటే ఎంతవరకైనా పోరాడుతామని అన్నారు. రాష్ట్రంలో గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ వంద రోజుల్లో అమలు చేసి చూపించిందని అన్నారు. 

రిజర్వేషన్లు రాజ్యాంగం కాపాడేందుకు చివరి వరకు పోరాడతామని అన్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ వస్తే పాంచ్ న్యాయ్. పచ్చీస్ గ్యారెంటీలు అమలవుతాయని తెలిపారు. కాంగ్రెస్ స్థాపించిన జాతీయ సంస్థలను మోదీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. నిరుద్యోగం, ఆకలి, అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. 

బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తామంటే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు ప్రశ్నించారు.  కాంగ్రెస్ ఖాతాలను కుట్రపూరితంగా స్తంభింపజేశారని తెలిపారు. పంద్రాగస్టు వరకు రైతు రుణమాఫీచేసి తీరుతామని మల్లికార్జున్  ఖర్గే తెలిపారు.